కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. లాక్డౌన్ ఎత్తేసే వరకు మద్యం దుకాణాలు మూసేయాలని, కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రత్యేక సాయం ప్రకటించి ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం నిరసన - రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం నిరసన
కరోనా వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
కరోనా నివారణకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, ఇతర రంగాల వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. అన్ని రకాల రుణాల మీద వడ్డీ మాఫీ చేయాలని కోరారు. పేద కుటుంబానికి నెలకు పదివేల చొప్పున మూడు నెలలకు సరిపడా నగదు సాయం అందించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుంచి రూ.5వేలు అందించాలన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదల సమస్యలు పరిష్కరించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. పట్టణ కేంద్రంలో నిరసన తెలియజేశారు.
ఇవీ చూడండి:విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి