ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో కొవిడ్ టీకా వేస్తున్నట్టు కుమురం భీం అసిఫాబాద్ జిల్లా పాలనాధికారి రాహుల్‌రాజ్ తెలిపారు. జిల్లాలో ఆసిఫాబాద్‌లో ఒకటి, కాగజ్‌నగర్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొదటి టీకాను పారిశుద్ధ్య కార్మికుడు మురళికి వేశామన్నారు.
ఆసిఫాబాద్‌లో మొదటి టీకా మురళికే... - పారిశుద్ధ్య కార్మికునికి మొదటి టీకా
ప్రభుత్వం ప్రారంభించిన కొవిడ్ టీకా పంపిణీలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పారిశుద్ధ్య కార్మికునికి మొదటి టీకాను వేశారు. జిల్లాలో మూడు చోట్ల వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
మొదటి టీకాను పారిశుద్ధ్య కార్మికునికి ఇచ్చిన వైద్యులు
ప్రధాని ప్రసంగం అనంతరం వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి చొప్పున మొత్తం 90 మందికి టీకాలు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని జడ్పీ ఛైర్మన్ కోవా లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు.