మొదటి డోస్ తీసుకున్న వారికే కరోనా టీకా రెండో డోస్ ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి డోస్ పంపిణీ కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు కాగజ్నగర్ పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ అశ్విని తెలిపారు. మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ తీసుకునేందుకు టీకా కేంద్రాలకు రావాలని సూచించారు.
స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా కరోనా టీకా రెండో డోస్ - కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్
ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ కార్యక్రమం నిలిపివేసినట్లు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వైద్యురాలు డాక్టర్ అశ్విని తెలిపారు. మొదటి డోస్ తీసుకున్నవారంతా రెండో డోస్ కోసం కేంద్రాలకు రావాలని సూచించారు.
కరోనా వ్యాక్సినేషన్, కరోనా టీకా రెండో డోస్, కొవిడ్ వ్యాప్తి, కాగజ్నగర్ న్యూస్
కొవాగ్జిన్ మొదటి డోస్ తీసుకుని 4 వారాలు గడిచిన వారు, కొవిషీల్డ్ తీసుకున్న వారు 6 వారాలకు రెండో డోస్ తీసుకోవాలని డాక్టర్ తెలిపారు. స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా మొదటి డోస్ తీసుకున్నట్లు ధ్రువపత్రమైనా, మొబైల్ ఫోన్కు వచ్చిన సందేశమైనా చూపించి నేరుగా టీకా కేంద్రాల వద్ద రెండో డోస్ తీసుకోవచ్చని చెప్పారు.
Last Updated : May 8, 2021, 5:07 PM IST