తెలంగాణ

telangana

ETV Bharat / state

భూతగాదాలతో రైతు దంపతుల దారుణ హత్య - భూతగాదాలు

భూతగాదాలతో దంపతులను హత్య చేసిన ఘటన కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. ఉదయం పొలం పనులకు వెళ్తుండగా శ్యామ్​రావు, నీలాభాయిలను దాయాదులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

దంపతుల హత్య

By

Published : Jun 21, 2019, 5:07 PM IST

Updated : Jun 21, 2019, 8:27 PM IST

దంపతుల దారుణ హత్య

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో భూతగాదాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. వాంకిడి మండలం కిరిడి గ్రామానికి చెందిన శ్యామ్​రావు, నీలాభాయి అనే దంపతులను దాయాదులు దారుణంగా నరికి హత్య చేశారు. ఉదయం పొలం పనుల కోసం వెళ్లిన వారిపై అదును చూసి దాడి చేశారు. సమాచారం అందుకున్న ఆసిఫాబాద్​ డీఎస్పీ సత్యనారాయణ తన బృందాలతో విచారణ చేపట్టారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

గతంలో తమకు ప్రాణహాని ఉందని ఈ రైతు దంపతులు పలుమార్లు ఫిర్యాదు చేసినా... పోలీసులు పట్టించుకోలేదని మృతుల బంధువులు ఆరోపించారు. నిందితులు పక్క ఇంట్లో ఉన్న యశ్వంత్​రావు, తెలంగరావు, దంగుబాయిగా పోలీసులు గుర్తించారు. మొత్తం ఐదుగురు ఈ హత్యలో పాల్గొన్నట్లు సమాచారం. దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

ఇదీ చూడండి : ఛైర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం... భారీ ఆస్తి నష్టం

Last Updated : Jun 21, 2019, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details