తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓ వార్డు కౌన్సిలర్​.. హోటల్లో కార్మికురాలు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తాజా వార్త

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో తొమ్మిదో వార్డు కౌన్సిలర్​గా ఆమె వరుసగా మూడుసార్లు గెలిచింది. అయినా ఎటువంటి హంగులు ఆర్భాటాలకు పోకుండా కౌన్సిలర్​ నాగలక్ష్మి హోటల్లో పనిచేస్తూ సాధారణ జీవనం కొనసాగిస్తుంది.

COUNCILOR LIVING SIMPLE LIFE IN BHADRADRI KOTHAGUDEM
ఓ వార్డు కౌన్సిలర్​.. హోటల్లో కార్మికురాలు

By

Published : Feb 6, 2020, 4:31 PM IST

న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలిక ఎన్నికల్లో పోటీ చేసిన నాగలక్ష్మి 9వ వార్డు కౌన్సిలర్​గా నాగలక్ష్మి గెలుపొందారు. ఒకవైపు తెరాస అభ్యర్థులు హవాను కొనసాగిస్తున్నా.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా వరుస విజయాన్ని సాధించారామె

హోటల్​లో పనిచేస్తున్న కౌన్సిలర్​..

ప్రజా ప్రతినిధిగా ఆమె జీవనం ఒకవైపైతే.. కుటుంబ పోషణ నిమిత్తం తమ కుటుంబం నిర్వహించే హోటల్లో తాను ఒక సభ్యురాలిగా పని చేయడం మరోవైపు. వార్డులోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే మరో వైపు తన పని తాను చేయడం ఎంతో సంతోషంగా ఉందని నాగలక్ష్మి అంటోంది.

ఈరోజుల్లో వార్డు మెంబర్​గా గెలిస్తేనే హంగులు ఆర్భాటాలు చేస్తుంటే..కౌన్సిలర్​గా గెలిచిన నాగలక్ష్మీ... సాదాసీదాగా జీవిస్తూ అందరికి ఆదర్శనంగా నిలుస్తోంది.

ఓ వార్డు కౌన్సిలర్​.. హోటల్లో కార్మికురాలు

ఇదీ చూడుండి:ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే: మంత్రి ఈటల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details