తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్ నగర్ పట్టణంలో.. వలసకూలీలకు కరోనా.. - కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో రెండు కరోన పాజిటివ్ కేసులు

ఇతర రాష్ట్రాల నుంచి కాగజ్ నగర్ పట్టణానికి వచ్చిన వలసకూలీలు.. ఇద్దరికి కరోనా నిర్థారణ అయినట్లు వైద్యులు తెలిపారు. గంగారాం బస్తీకి చెందిన తండ్రి కూతుళ్లు కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ముంబయికి వలస వెళ్లారు. లాక్ డౌన్ నేపథ్యంలో వారం క్రితం స్వగృహానికి చేరుకున్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి.. క్వారంటైన్ తరలించారు.

Coronation for two migrants ..In Kumram Bheem District
కాగజ్ నగర్ పట్టణంలో.. వలసకూలీలకు కరోనా..

By

Published : May 25, 2020, 11:30 AM IST

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబయి నుంచి పట్టణానికి వచ్చిన ఇద్దరు వలస కూలీలకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని జిల్లా వైద్యాధికారి బాలు తెలిపారు. పట్టణంలోని గంగారాం బస్తీకి చెందిన తండ్రి కూతుళ్లు కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ముంబయికి వలస వెళ్లారు.

కరోనాతో ప్రయాణం

  • లాక్ డౌన్ నేపథ్యంలో ఈనెల 21న ముంబయి నుంచి జగిత్యాలలో ఉంటున్న తమ కూతురు వద్దకు చేరుకున్నారు.
  • అక్కడి నుంచి 22న కాగజ్ నగర్ పట్టణంలోని స్వగృహానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న వైద్య అధికారులు ఇరువురిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
  • 23న రక్తనమునాలను గాంధీకి పంపించగా పాజిటివ్ నిర్థారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు.

యంత్రాంగం అప్రమత్తం

కాగజ్ నగర్ పట్టణంలో తొలిసారిగా కరోనా కేసులు నమోదు కావడం వల్ల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితులను కలుసుకున్న 15మందిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కేసులు నమోదైన గంగారాం బస్తీని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. బస్తీని నలువైపులా దిగ్బంధం చేసి.. పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. బస్తి వసూలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చూడండి:రైతు రుణమాఫి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details