కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఉంటున్న ముగ్గురు వ్యక్తులను ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్న వీరిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ ముగ్గురు వలస కూలీలు గత నెల మార్చి 20న ఉత్తర్ ప్రదేశ్ నుంచి కాగజ్ నగర్ పట్టణానికి వచ్చారు. ఎస్పీఎం పరిశ్రమలో పని చేయడానికి పొరుగు రాష్ట్రం నుంచి రావడం వల్ల వారిని హోమ్ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు.
ఆసిఫాబాద్‌లో ముగ్గురు వ్యక్తుల 'ఐసోలేషన్' - కాగజ్‌నగర్‌లో ముగ్గురు వ్యక్తుల 'ఐసోలేషన్'
ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
![ఆసిఫాబాద్‌లో ముగ్గురు వ్యక్తుల 'ఐసోలేషన్' అనుమానితులకు కరోనా వైద్య పరీక్షలు : వైద్యులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6710766-thumbnail-3x2-coronaaa.jpg)
అనుమానితులకు కరోనా వైద్య పరీక్షలు : వైద్యులు
నిన్నటి నుంచి వారిలో ఒకరికి తీవ్రమైన దగ్గు జలుబు వస్తున్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే ఆసిఫాబాద్‌లోని ఈఎస్ఐ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వారిలో కోవిడ్- 19 లక్షణాలు లేనప్పటికీ... ముందస్తు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అనుమానితులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అనుమానితులకు కరోనా వైద్య పరీక్షలు : వైద్యులు
ఇవీ చూడండి : కరోనాపై పోరుకు కొత్త సైన్యం- ఆన్లైన్లో శిక్షణ!