కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో కరోనా కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఓ యువతికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.
రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్కు చెందిన అక్కా, చెల్లెళ్లు ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. వారం రోజుల క్రితం తిరిగి స్వగ్రామానికి వచ్చారు. అప్పటి నుంచి వారికి జ్వరం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం వల్ల.. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయనే అనుమానంతో స్థానిక సింగరేణి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.