ఏప్రిల్ 23న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చివరి కరోనా కేసు నమోదైంది. మొత్తం ఏడు పాజిటివ్ కేసులు నమోదు కాగా, హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం వీరందరూ వ్యాధి నుంచి కోలుకున్నారు. మళ్లీ మే 24న అంటే 31 రోజుల అనంతరం కాగజ్‌నగర్‌లో దంపతులకు కరోనా అని తేలింది. పదేళ్ల క్రితం ఉపాధికి ముంబయి వెళ్లిన వీరు లాక్‌డౌన్‌తో ఉపాధి కరవై పట్టణానికి 23న చేరుకున్నారు. వీరిని ఆసిఫాబాద్ ఐసోలేషన్‌కు తరలించగా, పాజిటివ్ రిపోర్టు 24న వచ్చింది.
మరో అయిదుగురి గుర్తింపు...
ముంబయి నుంచి కాగజ్‌నగర్‌కు వచ్చిన మరో అయిదుగురు వలస కార్మికులను అధికారులు సర్వేలో భాగంగా గుర్తించి రక్త నమూనాలను ఆదిలాబాద్ రిమ్స్‌కు పంపించగా, అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కరోనా వచ్చిన దంపతులను కలిసిన పట్టణంలోని 15 మందిని ఆసిఫాబాద్ ఐసోలేషన్‌కు తరలించారు. కాగజ్‌నగర్ పురపాలిక, రెవెన్యూ, పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం కాగజ్‌నగర్ పురపాలిక కమిషనర్ కె.శ్రీనివాస్, టీపీబీవో సాయికృష్ణ, ఇన్‌ఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ బంగారు శ్రీనివాస్, తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, పోలీసుల ఆధ్వర్యంలో ఆ కాలనీ ఇరువైపులా నిర్బంధించారు.
అధికారుల ఆరా..
ముంబయి నుంచి వలస కూలీ దంపతులు ఎప్పుడు వచ్చారు? వారి ఇంటికి ఎవరెవరూ వచ్చి కలిశారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా పాజిటివ్ అని తెలవడంతో వీరి ఇంటికి ఇరువైపుల ఉన్న దాదాపు 15 మందిని అనుమానంతో ఆసిఫాబాద్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. 21న ఆ దంపతులు తమ కూతురు ఉంటున్న జగిత్యాలకు వెళ్లారు. 22న కాగజ్‌నగర్‌లోని స్వగృహానికి చేరుకున్నారు. అయితే వారు వచ్చిన బస్సు, బస్టాండ్ నుంచి ఇంటికి ఆటోలో వచ్చారు. వచ్చిన బస్సు, వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
ఇంటింటికీ వైద్య పరీక్షలు..