కరోనా వ్యాప్తి విజృంభించకుండా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పురపాలక అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. కార్యాలయంలో జనసంచారం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ పనుల మీద పురపాలికకు వచ్చే వారికి సంబంధిత అధికారుల చరవాణి నంబర్లు ఇచ్చి సంప్రదించాల్సిందిగా సూచిస్తున్నారు. అర్జీలు ఇచ్చేవారికోసం దరఖాస్తు డబ్బాలు ఏర్పాటు చేశారు.
కరోనా కట్టడికి కాగజ్నగర్ పురపాలిక చర్యలు - corona precautions in kagaznagar municipality
కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు కట్టడి చర్యలు చేపడుతున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పురపాలక అధికారులు ప్రజలు కార్యాలయానికి రాకుండా సంబంధిత అధికారుల చరవాణి నంబర్లు ఇచ్చి సంప్రదించాల్సిందిగా సూచిస్తున్నారు.
కరోనా కట్టడికి కాగజ్నగర్ పురపాలిక చర్యలు
కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ఉన్నతాధికారులు.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేస్తున్నారు. ప్రజలంతా స్వీయ నిబంధనలు పాటించి కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
- ఇదీ చూడండి:డిశ్ఛార్జి తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి!