కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో కరోనా కేసులు నమోదు అయినందున జిల్లా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమయింది. కాగజ్ నగర్ పట్టణంలోని గంగారాం బస్తీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
కాగజ్‌నగర్‌లో పాజిటివ్ కేసు.. అధికారులు అప్రమత్తం! - కరోనా పాజిటివ్ కేసులు
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో కరోనా కేసులు నమోదు కావడం వల్ల జిల్లా పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు వీధుల్లో రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.
![కాగజ్‌నగర్‌లో పాజిటివ్ కేసు.. అధికారులు అప్రమత్తం! Corona Positive Cases Found In kagaz Nagar Town](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7356260-939-7356260-1590504629067.jpg)
కాగజ్‌నగర్ పాజిటివ్ కేసు.. అధికారులు అప్రమత్తం!
నగర కమిషనర్ శ్రీనివాస్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ రసాయనాలను పిచికారీ చేయించారు. పురపాలక సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సద్దాం హుస్సేన్ పట్టణంలో తిరుగూతూ.. ప్రజలంతా అవసరం ఉంటేనే.. బయటకు రావాలని.. మాస్కులు, శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.