తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్బంధ తనిఖీల్లో 23 ద్విచక్రవాహనాలు స్వాధీనం - cordon search at bhattupalli

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రూ. 23,970 విలువైన మద్యం, సరైన ధ్రువపత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

నిర్బంధ తనిఖీల్లో 23 ద్విచక్రవాహనాలు స్వాధీనం

By

Published : Nov 16, 2019, 9:05 AM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ సుధీంద్ర ఆధ్వర్యంలో చేసిన సోదాల్లో భారీగా నిల్వ ఉంచిన మద్యం లభించింది. రూ.23,970 విలువైన మద్యం, నిషేధిత గుట్కా, సరైన ధ్రువపత్రాలు లేని 23 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం నిల్వ ఉంచిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ప్రజల శాంతి భద్రత పరిరక్షణలో భాగంగానే తనిఖీలు చేపట్టినట్లు ఏఎస్పీ తెలిపారు.

నిర్బంధ తనిఖీల్లో 23 ద్విచక్రవాహనాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details