కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం తోయిబా నగర్ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీ స్వామి, ఎస్‌హెచ్‌వో మోహన్ తదితరులు పాల్గొన్నారు. రానున్న పురపాలిక ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఓటేయాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించారు.
కాగజ్‌నగర్‌లో నిర్బంధ తనిఖీలు... 39 మద్యం సీసాలు స్వాధీనం - కాగజ్ నగర్లో నిర్భంద తనిఖీలు... 39 మద్యం సీసాలు స్వాధీనం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటేయాలని సూచించారు.
![కాగజ్‌నగర్‌లో నిర్బంధ తనిఖీలు... 39 మద్యం సీసాలు స్వాధీనం ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటేయండి : ఎస్పీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5689931-thumbnail-3x2-sp.jpg)
ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటేయండి : ఎస్పీ
ప్రజలెవరూ వ్యక్తిగతంగా ఘర్షణలకు దిగరాదని ఆయన తెలిపారు. ప్రజల్లో అభద్రతాభావం తొలగించడానికే నిర్బంధ తనిఖీలు చేపడుతున్నామని వెల్లడించారు. తనిఖీల్లో 39 మద్యం సీసాలు, గుట్కా, పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించి... ఒకరిపై కేసు నమోదు చేశారు.
ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటేయండి : ఎస్పీ
ఇవీ చూడండి : దుండిగల్‌లోని పీఎస్‌లోని రెండు విల్లాల్లో చోరీ