కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ - కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో సంతకాల సేకరణ
కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరయ్యారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు అన్ని విధాలా నష్టం కలుగుతుందని అన్నారు. కేవలం బడావ్యాపారస్తులకు లబ్ధి చేకూరేలా ఉన్నాయన్నారు. చట్టసభల్లో అప్రజాస్వామికంగా బిల్లులను ఆమోదింపజేశారని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలను నుంచి సంతకాల సేకరణ చేపట్టి, వాటిని రాష్ట్రపతికి చేరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ హరీష్ బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.