కుమురం భీం జిల్లాలో కాంగ్రెస్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లులకు, ఎల్ఆర్ఎస్ బిల్లులకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కిసాన్ మజ్దూర్ బచావ్ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆసిఫాబాద్‌లోని ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ - కుమురం భీం జిల్లా తాజా వార్తలు
కుమురం భీం జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కిసాన్ మజ్దూర్ బచావ్ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లులకు, ఎల్ఆర్ఎస్ బిల్లులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.
![కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
అనంతరం గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ బిల్లును ఉపసంహరించుకోవాలని అన్నారు.
ఇదీ చదవండిఃశనగ, వేరుసెనగలకైనా రాయితీ ఇవ్వాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు