దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హాథ్రస్ బాధితురాలికి నివాళులర్పిస్తూ 2నిమిషాలు మౌనం పాటించారు. అత్యాచార ఘటనలోని నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ డా. పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు.
యూపీ ఘటనను నిరసిస్తూ కాగజ్‌నగర్‌లో సత్యాగ్రహ దీక్ష - యూపీ ఘటనకు నిరసనగా కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
యూపీ హాథ్రస్ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. అత్యాచార ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
యూపీ ఘటనను నిరసిస్తూ కాగజ్‌నగర్‌లో సత్యాగ్రహ దీక్ష
బాధిత యువతి కుటుంబీకులను, రాజకీయ నాయకులను, మీడియాను కలుసుకోకుండా ఆంక్షలు విధించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అత్యాచార ఘటనలో నిజానిజాలు బయటకు రాకుండా యోగి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ దస్తగిర్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:నేరాలను అరికట్టేందుకు మంచి పోలీస్ వ్యవస్థ: కిషన్‌రెడ్డి