తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​లో కాంగ్రెస్​ నేతల ఆందోళన - Cooperative Society Elections

సహకార సంఘం ఎన్నికల్లో అధికారులు తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్​ నేతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్​లోని సహకార సంఘ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

congress leaders protest in nirmal
నిర్మల్​లో కాంగ్రెస్​ నేతల ఆందోళన

By

Published : Feb 9, 2020, 11:07 PM IST

నిర్మల్​లోని సహకార సంఘ కార్యాలయం వద్ద కాంగ్రెస్​ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సహకార సంఘం ఎన్నికల్లో అధికారులు తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన చేపట్టారు. దాదాపు గంటకు పైగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. దిలావార్​పూర్ మండలం బండపల్లి రైతు సహకార సంఘంలో డైరెక్టర్ పదవి కోసం రవి అనే వ్యక్తి నామమాత్రం దాఖలు చేశారని పేర్కొన్నారు.

బకాయి కారణంగా అతని నామ పత్రాన్ని తిరస్కరించాలంటూ అభ్యర్థన వచ్చిందని, ఈ మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అర్హత ఉన్న వారి వివరాలతో ఇప్పటికే ఓటరు జాబితాను అధికారులు ప్రకటించారని, జాబితాలో పేర్కొన్న వారు పోటీ చేసేందుకు అర్హులన్నారు.

నిర్మల్​లో కాంగ్రెస్​ నేతల ఆందోళన

ఇదీ చూడండి:ఆ సామర్థ్యం దిల్లీ తర్వాత హైదరాబాద్​కే!

ABOUT THE AUTHOR

...view details