తెలంగాణ

telangana

కాగజ్​నగర్​లో ఉద్రిక్తత... లారీ దగ్ధం

By

Published : Jul 27, 2019, 7:55 PM IST

Updated : Jul 27, 2019, 8:16 PM IST

సిర్పూర్ పేపర్ మిల్లు సరకు రవాణా కోసం అసోషియేషన్ లారీలనే వాడుకోవాలంటూ లారీ యజమానులు డిమాండ్ చేశారు. రోడ్డుపై ఉన్న ఒక లారీని లారీ అసోసియేషన్ సభ్యులు తగలబెట్టారు. పరిశ్రమ యాజమాన్యానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఓ లారీ యజమాని పురుగుల మందు తాగాడు.

spm

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎస్పీఎం పరిశ్రమ యాజమాన్యం, లారీ అసోసియేషన్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సరుకు రవాణా కోసం అసోసియేషన్ లారీలనే వాడుకోవాలని యజమానుల డిమాండ్‌ చేశారు. రోడ్డుపై ఉన్న ఒక లారీని లారీ అసోసియేషన్ సభ్యులు తగలబెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లారీలను అడ్డుకోవడం సరికాదని సూచించారు. పరిశ్రమ యాజమాన్యానికి పోలీసులు అనుకూలంగా వ్యవహర్తిస్తున్నారని లారీ యజమానుల ఆరోపించి ఆందోళనకు దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ లారీ యజమాని ఉస్మాన్ పురుగుల మందు తాగాడు. అతన్ని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.

కాగజ్​నగర్​లో ఉద్రిక్తత.. లారీ దగ్ధం
Last Updated : Jul 27, 2019, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details