కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలంటూ కలెక్టర్ రాహుల్ రాజ్ ఇచ్చిన ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్ అమ్మకాలు చేపడుతున్న వారిపై జరిమానాలు విధిస్తున్నారు. పట్టణంలోని పలు దుకాణాలను కమిషనర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తోన్న సంజయ్ అసావ అనే వ్యాపారికి 10,000 రూపాయలు జరిమానా విధించారు.
ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా పలు దుకాణాల తనిఖీ - ప్లాస్టిక్ అమ్మకాలపై చర్యలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగజ్ నగర్ పట్టణంలోని పలు దుకాణాలను కమిషనర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తోన్న ఓ వ్యాపారికి 10,000 రూపాయలు జరిమానా విధించారు.
commissioner srinivas, plastic control, kumaram bheem asifabad district
కాగజ్ నగర్ పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించేందుకు అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్లాస్టిక్ మానవాళి మనుగడకు ముప్పు అని తెలియజేశారు.
ఇదీ చూడండి: వంటనూనెల ధరలు తగ్గేది అప్పుడే