కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కరోనా కట్టడి కోసం… లాక్డౌన్ అమలుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు పుర కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం రావడంతో రద్దీ పెరిగి ప్రజలు భౌతికదూరం పాటించడం లేదని అన్నారు.
'వ్యాపారులు, ప్రజలు విధిగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలి' - తెలంగాణ తాజా వార్తలు
కాగజ్ నగర్ పట్టణంలో కొవిడ్ మహమ్మారి నియంత్రణకై… లాక్డౌన్ అమలు కోసం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు పుర కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. లాక్డౌన్ సడలింపు సమయంలో వ్యాపారులు, ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

'వ్యాపారులు, ప్రజలు విధిగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలి'
ఈ నేపథ్యంలో బల్దియా అధికారులు, వ్యాపార సముదాయాలు, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో భౌతికదూరం ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతీ దుకాణం ముందు కనీస భౌతిక దూరం పాటించేలా గుర్తులు పెట్టారు. వినియోగదారులు ఆ గుర్తుల్లో నిలబడి సరుకులు, వస్తువులు కొనుగోలు చేయాలని సూచించారు. వ్యాపారులు విధిగా లాక్డౌన్ నిబంధనలు అమలు చేయాలని కమిషనర్ శ్రీనివాస్ ఆదేశించారు.
ఇదీ చూడండి:కాళ్లకు బొబ్బలెక్కినా.. నడక ఆగదు..