కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, ఆసిఫాబాద్‌లో కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలో ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో హాజరు రిజిస్టర్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కొవిడ్ బారిన పడ్డ వ్యక్తులు బయటకు వెళ్లకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
'క్వారంటైన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి'
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో హాజరు రిజిస్టర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
అలాగే క్వారంటైన్ కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు చేశాక.. నెగిటివ్ వచ్చిన వారిని డిశ్ఛార్జి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వాంకిడి చెక్‌పోస్ట్ నుంచి ఆసిఫాబాద్‌కు వచ్చిన 12 వాహనాల్లోని 41 మంది ప్రయాణికుల్లో... ఏడుగురిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించామన్నారు. గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో మొత్తం 2405 నమూనాలు గాంధీ ఆస్పత్రికి పంపగా... 2192 నెగిటివ్ వచ్చాయన్నారు. 158 పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇంకా 55 మంది ఫలితాలు రావాల్సి ఉందన్నారు.