దీపావళి సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసి గ్రామాల్లో సంబురాలు జరుగుతున్నాయి. గుస్సాడి నృత్యంతో గిరిజనుల సంప్రదాయ వేడుకలు జరుపుకుంటున్నారు. జిల్లాలోని జైనూరు మండలం మార్లవాయి గ్రామంలో జిల్లా పాలనాధికారి రాహుల్రాజ్ పర్యటించారు.
మార్లవాయి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ రాహుల్ రాజ్
మార్లవాయి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామాన్ని పాలనాధికారి సందర్శించారు.
మార్లవాయి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ రాహుల్ రాజ్
గ్రామంలో గుస్సాడి నృత్యాన్ని తిలకించారు. ఆదివాసీలు ఏత్మసూర్ దేవతకు ప్రత్యేక పూజలు చేసి నృత్యాన్ని ప్రారంభించారు. మార్లవాయి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఆదివాసుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:పెద్దపులి సంచారం... అటవీశాఖ అప్రమత్తం