కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఫీవర్ సర్వే, కరోనా నివారణ చర్యలను కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షించారు. రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకొని సర్వే జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. సర్వే బృందం సభ్యులు సేకరించిన వివరాలను ఆయన పరిశీలించారు.
కాగజ్‌నగర్‌లో ఫీవర్ సర్వేపై కలెక్టర్ పర్యవేక్షణ - కాగజ్ నగర్లో ఫీవర్ సర్వే
కాగజ్‌నగర్‌లో జరుగుతున్న ఫీవర్ సర్వేను కుమురం భీం కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షించారు. కరోనా సోకిన వారి వివరాలను ఎప్పటికప్పుడు సేకరించాలని ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు.
కాగజ్‌నగర్‌లో ఫీవర్ సర్వేను పరిశీలించిన కలెక్టర్
కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఇచ్చే మందులు, కిట్స్‌ను పరిశీలించిన ఆయన.. కొవిడ్ బాధితుల వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలని ఆదేశించారు. వారికి తగు సూచనలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. రాజేశం, కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.