తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్​ మానవత్వం: ఏతోడూ లేని అవ్వకు ఆశ్రయం - కుమురం భీం జిల్లా తాజా వార్తలు

తన కష్టాలను చెప్పుకునేందుకు కలెక్టరేట్​కు వచ్చిన ఓ ముసలవ్వ పట్ల పాలనాధికారి సందీప్​కుమార్​ ఝా మానవత్వంతో స్పందించారు. ఆ అవ్వ కష్టాలను ఓపిగ్గా విన్నారు. ఆశ్రయం లేని ఆ అవ్వను ఓ వృద్ధాశ్రమంలో చేర్పించి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ​

Collector Humanity: Shelter in a nursing home for a grandmother who has never been
కలెక్టర్​ మానవత్వం: ఏతోడూ లేని అవ్వకు వృద్ధాశ్రమంలో ఆశ్రయం

By

Published : Sep 6, 2020, 12:59 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​ననగర్​ మండలం సిర్పూర్ (టి)కి చెందిన మేరీ శారద అనే 90 సంవత్సరాల వృద్ధురాలు జిల్లా పాలనాధికారి సందీప్​కుమార్​ ఝాను కలిసేందుకు కలెక్టరేట్​కు వచ్చింది. కలెక్టర్​ ఆమె వద్దకు వచ్చి.. ఏం సహాయం కావాలమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించారు.

కలెక్టర్ సారును కలుద్దామని వచ్చిన కొడుకా అని వృద్ధురాలు చెప్పగా.. నేనేనమ్మా అంటూ ఆమెకి ఎదురుగా కూర్చొని ఆమె చెప్పిన సమస్యను ఓపిగ్గా విన్నారు. ఏ దిక్కు లేని తనకు ఆశ్రయం కల్పించి ఆదుకోవాలని ఆ ముసలవ్వ కోరగా.. వెంటనే మహిళా శిశు సంక్షేమ అధికారిణిని పిలిచి గోలేటిలోని వృద్ధాశ్రమానికి తరలించారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తనకు ఆశ్రయం కల్పించిన కలెక్టర్​కు ముసలమ్మ కృతజ్ఞతలు తెలిపింది.

ఇదీచూడండి.. ఐదు రోజులుగా ఆసిఫాబాద్​లోనే పోలీస్​ బాస్​.. అధికారులతో సమీక్ష

ABOUT THE AUTHOR

...view details