తెలంగాణ

telangana

ETV Bharat / state

కుమురం భీం కలెక్టర్​ను అడ్డుకున్న రైతులు - కుమురం భీం కలెక్టర్​ను అడ్డుకున్న రైతులు

జిల్లాలో యూరియా కొరత పెరుగుతుందంటూ... తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు కుమురం భీం జిల్లా కలెక్టర్​ను అడ్డగించారు.

కుమురం భీం కలెక్టర్​ను అడ్డుకున్న రైతులు

By

Published : Sep 23, 2019, 3:28 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద కలెక్టర్​ను రైతులు అడ్డుకున్నారు. తమకు సరిపడా యూరియా ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పాల్గొనేందుకు వెళ్తున్న పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతును అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా ఇస్తామని చెప్పి అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ యూరియా ఇవ్వడం లేదంటూ తమగోడు వెళ్లబోసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని పాలనధికారి హామీ ఇచ్చి వారితో ఆందోళన విరమింపజేశారు.

కుమురం భీం కలెక్టర్​ను అడ్డుకున్న రైతులు

ABOUT THE AUTHOR

...view details