తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ అసహనం - కాగజ్​నగర్​లో కలెక్టర్ పర్యటన

పట్టణ ప్రగతిలో భాగంగా కాగజ్​నగర్​లో కలెక్టర్ పర్యటించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అసహనం వ్యక్తం చేసిన పాలనాధికారి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.

collecter serious on muncipal employes about sanitation maintanence in kagaznagar
పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ అసహనం

By

Published : Mar 3, 2020, 6:06 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో పట్టణ ప్రగతి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా పలు వార్డుల్లో పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మురుగు కాల్వల్లో వెంటనే చెత్తచెదారం తొలగించాలని ఆదేశించారు.

పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు. రోడ్లపై వ్యర్థాలు వేయొద్దని ప్రజలకు సూచించారు. పింఛన్ రావడం లేదని పులువురు వృద్ధులు ఫిర్యాదు చేయగా... సమస్య పరిష్కరించాలని కమిషనర్​ను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్​ ఛైర్మన్​ సద్దాం, కమిషనర్ తిరుపతి పాల్గొన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ అసహనం

ఇవీ చూడండి:పార్లమెంట్​లో కోమటిరెడ్డి ప్రశ్న... తోమర్ ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details