CM KCR Election Campaign at Asifabad : గతంలో వానాకాలం వస్తే మంచం పట్టిన మన్యం అని పత్రికల్లో వార్తలు వచ్చేవని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) గుర్తు చేశారు. కానీ అలాంటి ఆసిఫాబాద్‌లో ఇప్పుడు మెడికల్ కాలేజీ, వందల పడకల ఆస్పత్రి వచ్చాయని హర్షించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Public Meeting)లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ప్రసంగించారు.
ఎన్నికలు వస్తాయి.. పోతాయి.. ప్రజాస్వామ్యం గెలవాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటే(VOTE) వజ్రాయుధమని.. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను గమనించాలని సూచించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని.. తెలంగాణ రాబట్టే ఆసిఫాబాద్ జిల్లా అయిందని చెప్పారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాడిన కుమురం భీం పేరును జిల్లాకు పెట్టుకున్నామని గుర్తు చేశారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం.. గిరిజనులు కాని వారికి కూడా త్వరలో పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. మాలి కులస్తుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ప్రత్యేకంగా చెప్పారు. మూడోసారి తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్నికలు జరుగుతున్నాయి.. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజాస్వామ్య పరిణితితో ఆలోచించి ఓటేయాలని సూచించారు. ఆ ఓటే రాబోయే ఐదేళ్లు మీ మనుగడను నిర్దేశిస్తుందన్నారు.
CM KCR Election Campaign 2023 : "టాప్‌గేర్‌లో కేసీఆర్ ప్రచార సభలు.. కాంగ్రెస్ వస్తే ఇబ్బందులు తప్పవని మండిపాటు"
"మూడోసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజాస్వామ్య పరిణితి ప్రదర్శించి ఓటు వేయాలి. ఎలక్షన్ వస్తుంది.. పోతుంది. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్ర ఏంది అనేది చూడాలి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల వద్ద ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు. ఆ ఓటు అనేది ఐదేళ్ల మీ చరిత్రను మారుస్తుంది. అందుకే ఆలోచించి ఓటేయండి. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం. తెలంగాణ రాష్ట్రం కాకపోతే ఆనాడు ఆసిఫాబాద్ జిల్లా కాకపోదును. గతంలో వార్తాపత్రికల్లో వర్షం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అనే కథనాలు వచ్చేవి. ఈరోజు ఆసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరూ అనుకోలేదు."- కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
మోరాయించిన హెలికాప్టర్.. బస్సులో ఆసిఫాబాద్‌కు సీఎం కేసీఆర్ :సిర్పూర్ కాగజ్‌నగర్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌పై ఆసిఫాబాద్ సభకు బయలుదేరారు. హెలికాప్టర్లో కూర్చున్న కేసీఆర్.. హెలికాప్టర్ మోరాయించడంతో దిగి బస్సులో రోడ్డు మార్గంలో ఆసిఫాబాద్ చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ప్రజలు సీఎం కేసీఆర్‌కు అభివాదం తెలిపారు.
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం- గిరిజనులు కానివారికీ త్వరలో పట్టాలు ఇస్తాం CM KCR Speech at Jukkal Praja Asheerwada Sabha : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కరెంట్ ఉండదు, రైతుబంధు అందదు : కేసీఆర్
CM KCR Speech in BRS Public Meeting at Aleru : కాంగ్రెస్ హయాంలో టపాసులు మాదిరి ట్రాన్స్ఫార్మర్లు పేలుతుండేవి : సీఎం కేసీఆర్