ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని తెలంగాణకు హరితహారం పేరుతో మొక్కలు నాటారు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పాలకవర్గం సభ్యులు. పట్టణ ఎల్లా గౌడ్ తోటలోని పిల్లల ఉద్యానవనంలో ఛైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ ఛైర్మన్ గిరీశ్ కుమార్, కౌన్సిలర్లు మొక్కలు నాటారు.
'ప్రతి కౌన్సిలర్ ఒక మొక్కను బాధ్యతగా తీసుకోవాలి' - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పట్టణ పాలకవర్గం సభ్యులు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హరితహారం చేపట్టారు. ప్రతి కౌన్సిలర్ విధిగా ఒక మొక్కను బాధ్యతగా తీసుకుని సంరక్షించాలని ఛైర్మన్ సద్దాం హుస్సేన్ కోరారు.
'ప్రతి కౌన్సిలర్ ఒక మొక్కను బాధ్యతగా తీసుకోవాలి'
మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటామని ఛైర్మన్ సద్దాం హుస్సేన్ తెలిపారు. ప్రతి కౌన్సిలర్ విధిగా ఒక మొక్కను బాధ్యతగా తీసుకొని సంరక్షించాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి:సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం