కొమురం భీం జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీని ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేపట్టారు. మట్టి గణనాథులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. మట్టితో చేసిన విగ్రహాలు శ్రేష్టమైనవని, సహజమైన, హానికరం కాని రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఇప్పటికే జరుగుతున్నటువంటి వాతావరణ సమస్యలు ప్రజలు తెలుసుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడకుండా ఉండాలని కోరారు.
'మట్టి గణపతి పూజ మానవాళికి శుభకరం' - Clay Ganapathi
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వాసవి క్లబ్, కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసన సభ్యులు ఆత్రం సక్కు పాల్గొన్నారు.

'మట్టి గణపతి పూజ మానవాళికి శుభకరం'