పౌరులంతా ఛత్రపతి శివాజీ వీరత్వాన్ని అందిపుచ్చుకొని నవ సమాజ నిర్మాణానికి పాటుపడాలని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. కుమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం గోవిందాపూర్లో జరిగిన ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఘనంగా ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ - mp soyam bapurao latest news
కుమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండలంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పాల్గొని శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఎగురవేశారు.
ఘనంగా ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి... పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు వంశీ, స్థానిక ప్రజాప్రతినిధులు, భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:అక్రమ వసూళ్లు.. అవినీతి 'రహదారి'..!