తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయి'

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కుమురం భీం కాగజ్​నగర్ జిల్లా కేంద్రంలో సేవ్ ఇండియా నిరసన కార్యక్రమం నిర్వహించారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయి'
'కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయి'

By

Published : Aug 9, 2020, 2:21 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సేవ్​ ఇండియా పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని రాజీవ్​ గాంధీ చౌరస్తాలో చేపట్టిన కార్యక్రమంలో సీఐటీయూ, సీపీఎం, సీపీఐ, ఆదివాసీ పట్నం తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ప్రజా సంఘాలు మండిపడ్డారు.

రూ.50 లక్షల బీమా కల్పించాలని...

ఓవైపు కరోనాతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. కరోనా లాక్​డౌన్ సమయంలో మొదటి వరుసలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు రూ.50 లక్షల భీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పలు సంస్థలను ప్రయివేటీకరించే యోచనను వెంటనే విరమించుకోవాలని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 1,982 కరోనా కేసులు... 12 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details