తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు బోల్తా.. ఇద్దరి గాయాలు - రోడ్డుపై కారు బోల్తా

కుమురం భీం జిల్లా లోనవెళ్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కారు బోల్తా.. ఇద్దరి గాయాలు

By

Published : Nov 3, 2019, 2:57 PM IST

కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం లోనవెళ్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. కౌటాల మండలం రవీంద్ర నగర్​కు చెందిన సల్మాన్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి కాగజ్​నగర్ వైపు వెళ్తుండగా లోనవెళ్లి మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.

కారు బోల్తా.. ఇద్దరి గాయాలు

ABOUT THE AUTHOR

...view details