అతివేగంతో ఆటోను ఢీకొన్న కారు... ఒకరు మృతి - car dash to auto
రెబ్బెన మండలం తక్కిళ్లపల్లిలో రహదారిపై ఆటోను కారు ఢీ కొట్టిన ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
![అతివేగంతో ఆటోను ఢీకొన్న కారు... ఒకరు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4829528-195-4829528-1571714836759.jpg)
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తక్కిళ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి మందమర్రికి వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.