తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న కారు - కుమురంభీం జిల్లా తాజా వార్త

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్​పై నుంచి వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

car and bike accident in kumuram bheem
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న కారు

By

Published : Mar 5, 2020, 3:07 PM IST

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఫ్లైఓవర్ పై ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ ఆరిఫ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

బాధితున్ని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న కారు

ఇవీ చూడండి:కరోనాపై ప్రముఖుల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details