కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె పదకొండవ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికారులు తాత్కాలిక కార్మికులతో బస్సులు నడిపిస్తున్నప్పటికీ... ప్రయాణికులు లేక ప్రయాణ ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. బస్సులో జనం లేక సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల తాత్కాలిక కండక్టర్లు అధిక ఛార్జీలు వసూలు చేయడం వల్ల జేబులకు చిల్లు పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చి ప్రజల కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.
వెలవెలబోతున్న ఆర్టీసీ బస్సులు - BUSSES FULL... PASSENGERS NILL...
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 11వ రోజుకు చేరింది. ప్రయాణికులు లేక బస్సులు, బస్టాండ్లు వెలవెలబోతున్నాయి.
![వెలవెలబోతున్న ఆర్టీసీ బస్సులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4755932-691-4755932-1571118221678.jpg)
వెలవెలబోతున్న ఆర్టీసీ బస్సులు