గత శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రావి శ్రీనివాస్ పార్టీని వీడారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ తరపున అభ్యర్థులకు బీ-ఫారాలు అడిగితే తిరస్కరించడం వల్ల కార్యకర్తల్లో అసహనం పెరిగిపోయిందన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బాలయ్య గౌడ్ వ్యవహార శైలి వల్ల నియోజకవర్గంలో మనుగడ కోల్పోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. తాను పార్టీలో ఉన్న లేకున్నా నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల పోరాడుతూనే ఉంటానని తెలిపారు.
బీఎస్పీ పార్టీకి రావి శ్రీనివాస్ రాజీనామా - bsp party ki rajinama chesina raavi srinivas
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బహుజన సమాజ్వాదీ పార్టీ ఇంఛార్జీ రావి శ్రీనివాస్ పార్టీని వీడుతున్నట్లు తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.
బీఎస్పీ పార్టీకి రావి శ్రీనివాస్ రాజీనామా