సిర్పూర్లో ఘనంగా వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు - సిర్పూర్లో ఘనంగా వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు
అది తిరుమల తిరుపతి దేవస్థానం కాదు... కానీ అదే రీతిలో బ్రహ్మోత్సవాలు జరిగే ప్రాంతం. అది ఎక్కడో కాదండోయి కుమురం భీం జిల్లా సిర్పూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం.
సిర్పూర్లో ఘనంగా వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు
కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పద్ధతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతిరోజు స్వామి వారికి వాహన సేవ నిర్వహిస్తారు. సిర్పూర్లోని స్వామివారికి తిరుమల తరహాలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.