కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఖైర్గం, రెబ్బెన, గంగపూర్ క్లస్టర్లలోని రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్తో కలిసి జిల్లా ఛైర్పర్సన్ కోవలక్ష్మి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో రైతుబంధు అందని రైతులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఎమ్మెల్యే సక్కు ఆదేశించారు.
నియంత్రిత సాగు పద్ధతితో రైతులకు మంచిరోజులు: ఎమ్మెల్యే
కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలోని పలు క్లస్టర్లలో రైతు వేదిక భవన నిర్మాణానికి జిల్లా ఛైర్పర్సన్ లక్ష్మి.. ఎమ్మెల్యే సక్కు, ఎమ్మెల్సీ సతీశ్కుమార్తో కలిసి భూమిపూజ చేశారు. సకాలంలో రైతులకు రైతుబందు అందేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.
ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండటం శుభ సూచకమన్నారు. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని తెలిపారు. సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ. 25 కోట్లతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజీ నిర్మించనున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో రైతుబంధు సాయం విడుదల చేసినట్లు చెప్పారు. అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో రైతుబంధు సాయం అందించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు