తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదానం చేసిన యువకులు, పోలీసులు - కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీసులు రక్తదాన శిబిరం

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించారు.

రక్తదానం చేసిన యువకులు, పోలీసులు

By

Published : Oct 19, 2019, 8:18 PM IST

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో పోలీసులు రక్తదాన శిబిరం చేపట్టారు. పట్టణంలోని ఈఎస్​ఐ ఆసుపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, ఎఎస్పీ వైవీస్ సుధీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి గుర్తింపు పత్రాలు అందజేశారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మల్లారెడ్డి, ఎఎస్పీ సుధీంద్ర, పలువురు పోలీసులు రక్తదానం చేశారు.

రక్తదానం చేసిన యువకులు, పోలీసులు

ABOUT THE AUTHOR

...view details