కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లోని ఎస్పీఎం పేపర్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పరిశ్రమలోని మూడో నంబరు పేపర్ యంత్రం వద్ద గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన పోల్కా కుమార్, చౌదరి శ్యామ్ రావు, మంచిర్యాల జిల్లాకు చెందిన రసకట్ల సాయి కృష్ణ ఎస్పీఎం పరిశ్రమలో ఐటీఐ అప్రెంటిస్‌గా పని చేస్తున్నారు. వీరిలో చౌదరి శ్యామ్ రావు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ తరలించారు.
పేపర్ మిల్లులో పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం - కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లోని ఎస్పీఎం పేపర్ పరిశ్రమ
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం పేపర్ మిల్లులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
పేపర్ మిల్లులో పేలుడు