తెలంగాణ

telangana

By

Published : Jan 1, 2020, 9:48 PM IST

ETV Bharat / state

తాడోబా అభయారణ్యంలో నల్ల చిరుత సంచారం

రెండేళ్లుగా జాడ కానరాని నల్లచిరుత ఇవాళ తాడోబా అభయారణ్యంలో దర్శనమిచ్చింది. నూతన ఏడాది సందర్భంగా అక్కడకు సందర్శనకు వెళ్లిన పర్యాటకులు తమ చరవాణిలో చిరుతను బందించేందుకు పోటీపడ్డారు.

black leopard
తాడోబా అభయారణ్యంలో నల్ల చిరుత సంచారం

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తాడోబా అభయారణ్యంలో నల్ల చిరుత సంచారం పర్యాటకులను కనువిందు చేసింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని తాడోబా అభయారణ్యాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత కనిపించి అబ్బురపరిచింది. ఇక్కడ వివిధ రకాల జంతువులు, మృగాలు ఉన్నప్పటికీ.. అత్యంత అరుదుగా కనిపించే నల్ల చిరుత సంచారం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సంవత్సరాల క్రితం తాడోబా అభయారణ్యంలో కనిపించిన నల్ల చిరుత.. మళ్ళీ 2020 ప్రారంభంలో కనిపించింది.

తాడోబా అభయారణ్యంలో నల్ల చిరుత సంచారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details