తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇప్పుడు క్రమబద్ధీకరణ సరికాదు: భాజపా నాయకులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎల్ఆర్ఎస్​కు వ్యతిరేకంగా కలెక్టర్​ కార్యాలయాన్ని భాజపా నాయకులు ముట్టిడించారు. నాయకులు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం వల్ల కొంతమేర పోలీసులకు భాజపా నాయకులకు తోపులాట జరిగింది. అనంతరం ఐదుగురిని మాత్రమే అనుమతించడం వల్ల వారు వెళ్లి కలెక్టర్​ సందీప్ కుమార్ ఝాకు వినతి పత్రం సమర్పించారు.

By

Published : Sep 29, 2020, 10:47 PM IST

ఇప్పుడు క్రమబద్ధీకరణ సరికాదు: భాజపా నాయకులు
ఇప్పుడు క్రమబద్ధీకరణ సరికాదు: భాజపా నాయకులు

గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్​ఎస్​ను వెంటనే విరమించుకోవాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రవేశ ద్వారం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. కార్యాలయంలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత సమయం వరకు పోలీసులకు, భాజపా నాయకులకు మధ్య తోపులాట జరిగింది.

అనంతరం ఐదుగురిని మాత్రమే అనుమతించడం వల్ల వారు వెళ్లి కలెక్టర్​ సందీప్ కుమార్ ఝాకు వినతి పత్రం సమర్పించారు. పైసా పైసా కూడపెట్టుకొని ఎంతో మంది పేదలు ఇళ్ల స్థలాలు కొనుక్కుంటే మళ్లీ వాటికి వేలు, లక్షలు వెచ్చించి క్రమబద్ధీకరించుకోవాలనడం సరికాదని నాయకులు మండిపడ్డారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న ఎల్​ఆర్​ఎస్​ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులను వేరే వాటికి మళ్లించి తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు.

ఇదీ చదవండి:ఎల్‌ఆర్‌ఎస్ జీవో సవరించి రేపు విడుదల చేస్తాం : కేటీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details