తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా సునామీలో తెరాస గల్లంతు ఖాయం: తరుణ్​చుగ్ - Bandi sanjay comments cm kcr

కుమురం భీం జిల్లా కాగజ్​​నగర్ పట్టణంలో భాజపా ఛత్రపతి శివాజీ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభలో ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్​చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.

v
భాజపా సునామీలో తెరాస గల్లంతు ఖాయం: తరుణ్​చుగ్

By

Published : Feb 23, 2021, 9:01 PM IST

రానున్న రోజుల్లో భాజపా సృష్టించే సునామీలో తెరాస కొట్టుకుపోతుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ సంకల్ప సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సభలో స్థానిక కాంగ్రెస్ నేత డా.పాల్వాయి హరీశ్​బాబు భాజపా తీర్థం పుచ్చుకోగా తరుణ్ చుగ్, బండి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దోపిడీ రాజ్యం...

దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పేదల అభివృద్ధికి బాటలు వేస్తోందని తరుణ్​చుగ్ అన్నారు. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో దోపిడీ రాజ్యం నడుస్తోందన్నారు. నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన పాల్వాయి పురుషోత్తం రావు ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చిన పాల్వాయి హరీశ్​బాబును పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని బండి సంజయ్ అన్నారు.

వారికి నిద్రలేని రాత్రులు...!

రాష్ట్రంలో భాజపా ధాటికి కేసీఆర్, కేటీఆర్​లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రాణహిత ప్రాజెక్టును వదిలిపెట్టి కేవలం కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు.

కేసీఆర్, కేటీఆర్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'గిరిజనులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details