తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదరణ ఓర్వలేక.. అనర్హత వేటు: భట్టి విక్రమార్క - Rahul Gandhi disqualified from Lok Sabha

Bhatti Vikramarka Padayatra in Kumurabhim Asifabad: రాహుల్​గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు చేసిన పాదయాత్రతో ప్రజలలో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక లోక్​సభలో అనర్హత వేటు వేశారని భట్టి విక్రమార్క అన్నారు. ఈ చర్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైందంటూ ఆరోపించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 25, 2023, 9:34 PM IST

Bhatti Vikramarka Padayatra in Kumurabhim Asifabad: రాహుల్​ గాంధీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర ద్వారా ప్రజలలో వచ్చిన ఆదరణకు భయపడి అతడిపై బీజేపీ ప్రభుత్వం లోక్​సభలో అనర్హత వేటు వేశారని సీల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నేటితో భట్టి పాదయాత్ర విజయవంతంగా పది రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 142 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు.

రాహుల్​ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు చేసిన పాదయాత్రలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను దేశం ముందుంచారని, ప్రజలలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక దేశ ప్రధాని నరేంద్రమోదీ, అమిత్​ షా ఇటువంటి కుట్రకు తెరలేపారన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రజస్వామ్యన్ని కూల్చివేస్తూ నియంతృత్వ పాలనలోకి తీసుకెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్​సభ స్పీకర్​కు సభ్యులపై ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉన్నప్పటికీ అవి రాజ్యాంగ స్ఫూర్తిని పాటించేవిగా ఉండాలన్నారు.

సూరత్​ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిందని సభాపతి రాహుల్ గాంధీపై లోక్​సభలో అనర్హత వేటు వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని ధ్వజమెత్తారు. రాజ్యాంగం ప్రకారం పైకోర్టులో తీర్పుపై అపీళ్లు చేసుకోవడానికి నెల రోజుల గడువు ఉన్నా వేచి చూడకుండా అనర్హత వేటు వేయడం దుర్మర్గమైన చర్యగా అభివర్ణించారు. గతంలో కూడా జనతా ప్రభుత్వం ఇందిరా గాంధీపై ఈ విధంగానే అనర్హత వేటు వేసిందని గుర్తు చేశారు. దేశంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు, నాయకత్వం అంతా కలిసి ఏఐసీసీ కార్యచరణ ప్రకారం ఈ చర్యకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేశారు.

"లోక్​సభ స్పీకర్.. రాహుల్​ గాంధీని సభలో అనర్హత వేటు వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. గౌరవ సభాపతికి సభ్యులపై ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగంలోని స్ఫూర్తికి అనుకూలంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోదీ, అమిత్​షా నాయకత్వంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడి, దేశంలో ప్రజస్వామ్యాన్ని కూల్చేయడం, నియంతృత్వ మార్గంలోకి పాలనను తీసుకెళ్లడం వంటి చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు పాదయాత్ర చేసిన రాహుల్​గాంధీకి ప్రజల నుంచి వచ్చిన ఆదరణను చూడలేక ఇటువంటి చర్యకు ఉపక్రమించారు. గతంలో కూడా ఇందిర గాంధీపై ఇలాగే వేటు వేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా కార్యచరణ ప్రారంభించి ఈ చర్యకు వ్యతిరేకంగా పోరాడుతాం". -భట్టి విక్రమార్క

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details