నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. దుకాణాలు తెరవకుండా బంద్ పాటిస్తున్నారు.
కాగజ్‌నగర్‌లో భారత్ బంద్.. వీధులు నిర్మానుష్యం - నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్
అన్నదాతలకు సంఘీభావం తెలుపుతూ పిలుపునిచ్చిన భారత్ బంద్... రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగజ్‌నగర్ పట్టణంలో దుకాణాలు తెరవకుండా వ్యాపార సంస్థలు బంద్‌కు సహకరిస్తున్నాయి.
కాగజ్‌నగర్‌లో భారత్ బంద్: వీధులు నిర్మానుష్యం
భారత్ బంద్‌కు తెరాసతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు పూర్తి మద్దతు తెలిపాయి. వ్యాపార సముదాయాలు తెరుచుకోకపోవడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఇదీ చదవండి:బంద్‌కు ఆర్టీసీ మద్దతు... కదలని బస్సులు