కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీమానుగొంది గ్రామానికి చెందిన మిషన్ భగీరథ పైపులైన్ జాయింట్ ఊడిపోయింది. ఈ ఘటనతో నీరు అందక గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. నీరు వృథాగా పోతోందని అధికారులకు చెప్పినా... మరమ్మతులపై అధికారులు స్పందించడం లేదు.
ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పైప్లైన్ లీక్.. - bhagiratha_neeru_vrudha
అసలే ఎండలు... దాహానికి అల్లాలాడిపోయే గ్రామాలు... ఇలాంటి పరిస్థితుల్లో కుమురంభీం జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ పైపులైన్ జాయింట్ ఊడిపోయి నీరు వృధాగా పోతోంది. సిబ్బందికి చెప్పినా మరమ్మతులు చేయకుండా ఊరుకున్నారు.
వృధాగా పోతున్న నీరు
ఇవీ చూడండి: అవసరానికి రాదు... అనవసరమైన వేళల్లో ఏడిపిస్తుంది