కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బొరిగాం శివారులో తమకు కేటాయించిన భూములను కబ్జా చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఆరోపించారు. కాగజ్ నగర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు చారిగాం, బొరిగాం శివారులో స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. స్థలం కేటాయించినట్లు ధ్రువపత్రాలు అందించినప్పటికీ.. స్థలాలను చూపెట్టలేదని పేర్కొన్నారు. శివారులోని ఖాళీ స్థలాల్లో కొంతమంది నివాసాలు ఏర్పరుచుకోగా.. మరికొంతమంది హద్దులు ఏర్పాటు చేసుకున్నారు.
'ధ్రువపత్రాలు ఉన్నాయి.. మా స్థలాలు మాకు కేటాయించాలి'
కాగజ్‌నగర్ మండలంలోని బొరిగాం శివారులో తమ భూములను కబ్జా చేస్తున్నారంటూ లబ్ధిదారులు వాపోయారు. తమ స్థలాలు చూపెట్టి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆ భూమిలో కంచె వేయడానికి వచ్చిన కూలీలను అడ్డుకున్నారు.
'ధ్రువపత్రాలు ఉన్నాయి... మా స్థలాలు మాకు కేటాయించాలి'
ఈమధ్యకాలంలో చారిగాం, బొరిగాం శివార్లలో భూములకు డిమాండ్ పెరగడంతో ఆక్రమణ దారుల కన్నుపడిందని అన్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారని వాపోయారు. ఈక్రమంలో బొరిగాం శివారులో కంచె వేసేందుకు బుధవారం ఉదయం కూలీలు రావడంతో లబ్ధిదారులు అడ్డుకున్నారు. ఈస్థలం తమకు కేటాయించిందని కూలీలను వారించారు. ప్రభుత్వ అధికారులు స్పందించి సత్వరమే తమకు స్థలాలు చూపెట్టి న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:ఫౌంటేన్‌లా ఎగిసిపడుతున్న మిషన్ భగీరథ నీరు