కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జురు మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి పలువురు గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. అధికారులు ఎంతకీ స్పందించడం లేదని కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, కుర్చీలను విరగొట్టారు. సబ్ స్టేషన్లో పనిచేసే ఉద్యోగులు.. అక్కడ జరుగుతున్న గొడవ గురించి పైఅధికారులకు సమాచారం అందించారు.
Villagers protest: విద్యుత్ సమస్య తీర్చాలంటూ అర్ధరాత్రి ఆందోళన - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జురు సబ్ స్టేషన్ సామాగ్రి ధ్వంసం
విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ అర్ధరాత్రి పూట నిరసనకు దిగారు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జురు వాసులు. అధికారులు స్పందించకపోవడంతో సబ్ స్టేషన్ కార్యాలయంలోని కంప్యూటర్లు, కుర్చీలను ధ్వంసం చేశారు.
విద్యుత్ సమస్య తీర్చాలంటూ అర్ధరాత్రి ఆందోళన
పై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హుటాహుటిని వారు రంగంలోకి దిగి ఘటనపై విచారణ చేపట్టారు. చాలా రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని... అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా మళ్లీ సమస్య ఉత్పన్నమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే నిరసన చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!