తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్‌నగర్‌లో ఎలుగుబంటి కలకలం - Kumuramabhim Asifabad Kagajnagar Bear

అరణ్యంలో ఉండాల్సిన ఎలుగుబంటి జనాల్లోకి వచ్చి వారిని కంగారు పెట్టింది. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో జరిగింది. స్థానికులు అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచామివ్వగా... వారు భల్లూకాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Bear
Bear

By

Published : Mar 24, 2020, 12:12 PM IST

కాగజ్‌నగర్‌లో ఎలుగుబంటి కలకలం

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. పట్టణంలోని విజయబస్తీలో ఓ ఇంట్లోకి భల్లూకం ప్రవేశించగా అప్రమత్తమైన యజమాని కేకలు వేశాడు. స్థానికులంతా కలిసి దానిని తరిమి కొట్టగా... పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూరినట్లు వారు తెలిపారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలెవరూ గుమిగూడి ఉండవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణంలో ఎలుగుబంటి సంచరిస్తుందన్న విషయం ప్రచారం కావడం వల్ల అక్కడివారు భయాందోళనలకు లోనయ్యారు.

ఇదీ చూడండి :కవరేజ్ కోసం వచ్చిన రిపోర్టర్​పై పోలీసుల దాడి

ABOUT THE AUTHOR

...view details