తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా రైతులపై పోలీసుల దాడి హేయం: బండి సంజయ్ - bandi sanjay fires on kcr

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కుమురంభీం జిల్లాలో అమాయక పేద మహిళా రైతులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు.

bandi sanjay
మహిళా రైతులపై పోలీసుల దాడి హేయం: బండి సంజయ్

By

Published : Apr 10, 2021, 4:36 PM IST

కుమురం భీం జిల్లా కొండపల్లిలో రైతుల కోసం భాజపా నేతలు చేస్తున్న దీక్షను పోలీసులు అర్ధరాత్రి బలవంతంగా భగ్నం చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తెలిపారు. అమాయక పేద మహిళా రైతులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అర్ధరాత్రి పోలీసులు దీక్షాశిబిరంపై ఆకస్మిక దాడి చేయడంతో భాజపా నేతలు పాల్వాయి హరీశ్​, సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. పేదలు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని మండిపడ్డారు.

హైదరాబాద్ చుట్టూ పక్కల తెరాస నేతలు కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేసినా.. పట్టించుకోని ప్రభుత్వం ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పేద రైతులపై ప్రతాపం చూపిస్తారా అని ధ్వజమెత్తారు. ఆసిఫాబాద్ ప్రజాస్వామ్య తెలంగాణలో ఉందా.. అరాచక రాజ్యంలో ఉందా అనేది అర్థం కావడం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details